ములుగు మండలం ఇంచర్లలో సోమవారం మంత్రి సీతక్క నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ ఏఈ బానోతు రవిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీకి లేఖ రాశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో వైఫల్యాన్ని తప్పుబట్టారు.
తెలంగాణ
విద్యుత్ ఏఈపై కలెక్టర్ ఆగ్రహం!


