హైదరాబాద్: 28°C
వార్తలు

ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

KMM: జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న డి.కొండయ్య,టి.వెంకటేశర్లు, వి.నరసింహరావు, ఎన్.హరిప్రసాద్, వి.జయరాజులు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్ వారికి పదోన్నతి చిహ్నాలు అలంకరించారు. వారు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు.