హైదరాబాద్: 28°C
వార్తలు

నాణ్యమైన విత్తనాలతో దిగుబడి: కేవీకే

BDK: నాణ్యమైన విత్తనాల వినియోగంతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి. భరత్ అన్నారు. సోమవారం బూర్గంపహాడ్‌లో బీపీటీ-5204 వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం సుజిత్ కుమార్, ప్యాక్స్ ప్రతినిధిలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.