BDK: దుమ్ముగూడెం మండలంలో 964 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంజూరు పత్రాలు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెల్లం


