హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఎస్పీ

భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్‌లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత సీఐలు, ఎస్ఐలతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని, నిష్పక్షపాత విచారణతో బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ తెలిపారు