హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు పలు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మంగళవారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు కేతేపల్లి, 9:30కి నకిరేకల్, 10:30కి కట్టంగూర్, 11 గంటలకు నార్కట్‌పల్లి, 11:30కి చిట్యాల, మధ్యాహ్నం 12:30కి రామన్నపేటలో పర్యటిస్తారు. ఆయా ప్రాంతాల్లో నూతన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం తెలిపింది.