హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి మూడు ఫిర్యాదులు

WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు ఫిర్యాదులు అందాయి. వీటిలో మండల పంచాయతీ అధికారి శాఖకు రెండు, రెవెన్యూ శాఖకు ఒక ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమానికి 14 శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.