హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుర్పం అనిత

ASF: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాగజ్‌నగర్ మండలం మాలిని గ్రామానికి చెందిన సుర్పం అనిత నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి సువర్ణ ఆమె పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.