MHBD: ప్రభుత్వ భూమిలో 2 చెట్లకు అనుమతి తీసుకుని ఏకంగా 147 దుంగలను అక్రమంగా తరలిస్తున్నారని కేసముద్రం మున్సిపాలిటీ కౌన్సిలర్లు సోమవారం అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 6వ వార్డు అమినాపురంలో జరిగిన ఈ చెట్ల నరికివేత అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. వెంటనే కలప రవాణాను అడ్డుకుని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
చెట్లు నరికివేత పై ఫిర్యాదు


