హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడ–హుజూర్‌నగర్ రహదారిపై ప్రమాదం

SRPT: చిలుకూరు మండల కేంద్రం శివారులోని కోదాడ–హుజూర్‌నగర్ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న కారు, పొలాల నుంచి గడ్డిమోపుతో టీవీఎస్ ఎక్స్ఎల్‌పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు గాయపడగా, స్థానికులు అతడికి సహాయం అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.