SRPT: అనంతగిరి మండల కేంద్రానికి చెందిన హనుమంతరావు (50) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్ అదుపుతప్పి ఖానాపురం శివారులోని పంట కాలువలో పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి కోదాడ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు.
తెలంగాణ
పంట కాలువలో పడి వ్యక్తి మృతి


