KMR: పాల్వంచ మండలం పరీస్పేట్ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డిని శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలని కోరుతూ వార్డు సభ్యులు, గ్రామస్థులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రూ.4.05 లక్షల డూప్లికేట్ బిల్లుల కేసుతో పాటు ఆయనపై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ను సస్పెండ్ చేసి, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సర్పంచ్‌ను తొలగించాలని కలెక్టర్‌కు వినతి


