VZM: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ, సీఎంఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ సోమవారం ఆదేశించారు. జిల్లాలోని 171 మిల్లులకు రూ.738.30 కోట్ల ఈ-బ్యాంక్ గ్యారంటీలు అవసరం కాగా, ఇప్పటివరకు నాలుగు మిల్లులే సమర్పించాయని తెలిపారు. ధాన్యం అందిన వారం రోజుల్లో మిల్లింగ్ ప్రారంభించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధాన్యం సేకరణలో నిబంధనలు పాటించాలి: జేసీ


