హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా ..ట్రాక్టర్లు పట్టివేత

BHPL: రేగొండ మండలం కనిపర్తిలో అనుమతులు లేకుండా మానేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. డ్రైవర్లు చందు, నర్ల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకున్నారు.  ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు SI సుధాకర్ తెలిపారు.