SRD: సంగారెడ్డి మండల పరిధిలోని నాలుగు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 33/11 KV సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ నిలిపివేయనున్నట్లు ఏఈ ప్రశాంత్ తెలిపారు. కలబ్‌గూర్, గంజిగూడెం, చింతలపల్లి, ముబారక్‌పూర్ గ్రామాల ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


