హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డికి రానున్న చాగంటి కోటేశ్వరరావు

KMR: ఈ నెల 18, 19 తేదీల్లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నిర్వహించనున్నారు. 18న గోమాత వైభవం, 19న కార్తీక మాస వైభవంపై ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు సోమవారం తెలిపారు. శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.