రోహిత్ శర్మ భవితవ్యంపై భారత దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ భవిష్యత్తుపై సెలెక్టర్లే తుది నిర్ణయం తీసుకోవాలన్నాడు. అతను ఇంకా ఆడగలిగితే కొనసాగించడం మంచిదేనని అభిప్రాయపడ్డాడు. దేశానికి అతడు ఎంతో సేవ చేశాడని కొనియాడాడు. అయితే ఏ ఆటగాడైనా ఒకరోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిందేనని చెప్పాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలన్నాడు.
క్రీడలు
రోహిత్ భవితవ్యంపై తుది నిర్ణయం వారిదే: కపిల్ దేవ్


