హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌లో కవి దంపతులకు సన్మానం

MHBD: సామాజిక అంశాలపై కవితలతో చైతన్యం కలిగిస్తున్న ఇనుగుర్తి గ్రామానికి చెందిన శీలం రాజిరెడ్డి, కృష్ణకుమారి దంపతులకు ఆంధ్రప్రదేశ్‌లో ఘన సన్మానం లభించింది. విజయనగరం జిల్లాలో ఆదివారం శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాహిత్య, సాంస్కృతిక మహోత్సవంలో వారు కవితలు వినిపించారు. నిర్వాహకులు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.