NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన కార్యక్రమానికి పలువురు విరాళాలు అందజేశారు. ముత్తుకూరు మండలం మిట్టపాలెం వాస్తవ్యులు దువ్వూరి నిరంజన్ రెడ్డి, మధుమిత దంపతులు సోమవారం నిత్యాన్నదానానికి లక్ష రూపాయలను విరాళంగా ఆలయ సిబ్బందికి అందజేశారు. అనంతరం దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
నిత్యాన్నదాన పథకానికి విరాళం


