KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు మంగళవారం చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సోమవారం కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. స్థానిక కమ్మవారి కల్యాణ మండపంలో సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హాజరై పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
రేపు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ


