హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

181 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

PPM: ఖరీఫ్ 2026-27 సీజన్‌లో పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా 181 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధర కింద సాధారణ రకానికి రూ.2,441, గ్రేడ్-ఎ ధాన్యానికి రూ.2,461 చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు.