హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రులు

SS: ​విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. సహచర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు మంత్రి సవిత తెలిపారు.