ములుగు, ఏటూరునాగారం సెక్టార్ల పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సోమవారం DWO ప్రేమలత తెలిపారు. తొలి దశలో వెంకటాపురం, తాడ్వాయి పరిధిలో 31 టీచర్, 104 హెల్పర్ పోస్టుల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని వెల్లడించారు. జిల్లాలో 30 కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తుండగా, మరో 174 భవనాలకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ పోస్ట్‌లకు త్వరలో నోటిఫికేషన్: DWO


