హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ పెద్ద తప్పు చేశాడు: కపిల్ దేవ్ 

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై విరాట్ కోహ్లీని భారత దిగ్గజం కపిల్ దేవ్ తప్పుబట్టాడు. రిటైర్మెంట్ ప్రకటించి కోహ్లీ పెద్ద తప్పు చేశాడని అభిప్రాయపడ్డాడు. పదేళ్ల తర్వాత ఈ నిర్ణయంపై కచ్చితంగా పశ్చాత్తాపపడతాడని వ్యాఖ్యానించాడు. సూపర్ ఫిట్‌గా ఉన్న కోహ్లీ 25 ఏళ్ల యువ ఆటగాడితోనూ పోటీపడగలడని కొనియాడాడు. కోపంలో రిటైర్మెంట్ ప్రకటించకుండా ఓపికగా ఉండాల్సిందని సూచించాడు.