E.G: చాగల్లు మండల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఇందులో భాగంగా చాగల్లు 8వ వార్డు అభ్యర్థిగా వేములూరి శివకుమార్ టిడిపి మద్దతుతో బరిలోకి దిగారు. సోమవారం ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. శివకుమార్ విజయానికి కృషి చేసేందుకు కూటమి నాయకులు ప్రచారాన్ని వేగవంతం చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
చాగల్లు 8వ వార్డు అభ్యర్థిగా వేములూరి శివకుమార్ నామినేషన్


