హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీతం కోసం 20 శాతం కమిషన్?

NLG: నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ సోమవారం నల్గొండ ప్రజావాణిలో ఎంపీడీవోపై ఫిర్యాదు చేశారు. తన జీతం మంజూరు చేసేందుకు 20 శాతం కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులు, ఎంపీడీవో వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి, తనకు జీతం ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టరేట్ అధికారులను కోరారు.