హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా

కోనసీమ: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. సోమవారం ఆయన ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పరిధిలో పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, పోలీసుల బందోబస్తును తనిఖీ చేసి పలు సూచనలు ఇచ్చారు.