WGL: పర్వతగిరి మండలం అన్నారం నిర్వహించిన 45వ రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ ఛాంపియన్‌షిప్ సోమవారం ముగిసింది. 28 జిల్లాల జట్లు పాల్గొన్న పోటీల్లో నాగర్‌కర్నూల్ జట్టు ప్రథమ, మహబూబ్‌నగర్ జట్టు ద్వితీయ, మహబూబాబాద్ జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు ఎంఈఓ బిక్షపతి బహుమతులు అందజేశారు. ఎంపికైన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
తెలంగాణ
ముగిసిన షూటింగ్‌బాల్ పోటీ


