హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే శిక్షకుల దరఖాస్తుల స్వీకరణ

MDK: జిల్లాలోని 106 సెకండరీ పాఠశాలల్లో కరాటే శిక్షణ అందించేందుకు శిక్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ రాజు తెలిపారు. రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ పథకం కింద డిసెంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని, 21న అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.