హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీ ఎన్నికలు.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాయి. సీట్ల పంపకాలపై ఇంకా చర్చలు జరగలేదని వెల్లడించారు. పొత్తు ధర్మంలో భాగంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ సీట్ల సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. అత్యుత్తమ అభ్యర్థులకే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గెలుపే లక్ష్యంగా తమ కూటమి ముందుకెళ్తుందని చెప్పారు.