PDPL: పాలకుర్తిలోని బసంతనగర్ జడ్పీ హైస్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎన్.సోమశేఖర్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 17న గోవాలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్స్ ఫుట్‌బాల్ (పురుషుల) టోర్నమెంట్‌లో ఆయన తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయస్థాయి పోటీలకు సోమశేఖర్ ఎంపిక కావడంతో ప్రధానోపాధ్యాయుడు ఆయనను అభినందించారు.
తెలంగాణ
జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి జిల్లా వాసి

