హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను సోమవారం వారి నివాసంలో పామిడి ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న పామిడిలో జరగబోయే ఎంపీటీసీల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని నూతన ఎంపీటీసీలకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యేను ఎంపీటీసీలు శాలువాతో సత్కరించి సన్మానించారు.