NLG: గుడిపల్లి గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను రాజకీయ పార్టీలకు అతీతంగా ఇళ్లు లేని పేదలకు కేటాయించాలని సర్పంచ్ కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ పాలకవర్గం సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలని కోరారు.
తెలంగాణ
'పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి'

