హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కార్యకర్తలా కలిసిపోయిన మాజీ ఎమ్మెల్యే

NLG: జిల్లాలో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ (AIKS) మహాసభల్లో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి నిరాడంబరత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1994-99 మధ్య నల్లగొండ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాధారణ కార్యకర్తలా సభకు హాజరయ్యారు. రైతులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఆయన సరళమైన తీరుపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.