హైదరాబాద్: 28°C
క్రీడలు

బౌలర్లను చూసి గర్వంగా ఉంది: గంభీర్

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ విజయం సాధించడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ విజయానికి బౌలర్లే ప్రధాన కారణమని ప్రశంసించాడు. బుమ్రా, హార్దిక్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా మిగతా బౌలర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. సిరీస్‌లను గెలిపించడంలో బౌలర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన చూసి గర్వంగా ఉందని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.