హైదరాబాద్: 28°C
క్రీడలు

RCB కెప్టెన్ 13 సిక్స్‌లతో విధ్వంసం!

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు RCB కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అసోంతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 135 పరుగులు బాదాడు. ఇందులో 8 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.