హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తిగత కక్షతోనే ఆరోపణలు: మున్సిపల్ ఛైర్మన్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో రెండు రోజుల క్రితం భారీ వృక్షాలను అనుమతులు తీసుకుని తొలగించామని మున్సిపల్ ఛైర్మన్ భానోత్ సునీత స్పష్టం చేశారు. సోమవారం ఆమె మాట్లడుతూ.. అభివృద్ధి పనులు చేపడితే తనపై వ్యక్తిగత కక్షతో కౌన్సిలర్ శరత్ యాదవ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.