హైదరాబాద్: 28°C
వార్తలు

ఫిలిప్పీన్స్ చేరుకున్న ప్రధాని

ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశానికి చేరుకున్నారు. మనీలాకు చేరుకున్న మోదీకి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. రేపు జరిగే 23వ ఆసియన్-భారత్ శిఖరాగ్ర సదస్సు, 21న తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు. భారత్-ఆసియాన్ సంబంధాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, వాణిజ్యం, సముద్ర సహకారం పెంపొందించటపై ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.