పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన పాటల ప్రదర్శనపై విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా దివంగత ఉర్దూ కవి రాహత్ ఇందోరి రాసిన కవితను ప్రస్తావించారు. తనను ఇండోర్ రాకుండా అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అయితే మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదని అందుకే అడ్డంకులన్నీ దాటి వచ్చినట్లు తెలిపారు. హిందూస్థాన్ ఎవరి జాగీరు కాదని పేర్కొన్నారు.
వార్తలు
హిందూస్థాన్ ఎవరి జాగీరు కాదు: సింగర్


