హైదరాబాద్: 28°C
వార్తలు

వలపు వలలు ఓ చిన్న భాగం మాత్రమే: అశుతోష్

మిలిటరీ, పరిశోధక నెట్‌వర్క్‌లను విదేశీ గూఢచర్యం నుంచి రక్షించుకునేందుకు ఉన్నత స్థాయి చర్యలు చేపట్టినట్లు వాయుసేన నూతన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ వెల్లడించారు. విదేశీ గూఢచర్య సంస్థలు హనీ ట్రాప్‌లతోపాటు.. ఇతర సైబర్ యుద్ధతంత్రాలను కూడా వాడుతున్నాయని ఆరోపించారు. మొత్తం ఇంటెలిజెన్స్‌లో వలపు వలలు ఓ చిన్న భాగం మాత్రమేనని పేర్కొన్నారు.