హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కుహల్గామ్ వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల కుల్గాంలో CRPF క్యాంప్‌పై జరిగిన కాల్పుల ఘటన వెనక ఈ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. హతుల్లో వాంటెట్ లష్కరే ఉగ్రవాది కూడా ఉన్నాడు. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.