హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం

HNK: హసన్‌పర్తి మండలం ఆదర్శనగర్‌లో సోమవారం పోలీసులు డోర్ టు డోర్ కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ నేతృత్వంలో పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, దొంగతనాల నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 112కు ఫోన్ చేయాలని సూచించారు.