హైదరాబాద్: 28°C
వార్తలు

‘కులం, మతం పేరుతో విభజన కుట్రలు’

భారత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని ఓర్వలేని కొన్ని శక్తులు బ్రిటిష్ తరహాలో 'విభజించు-పాలించు' కుట్రలకు తెరలేపాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ మండిపడ్డారు. మతం, కులం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విడదీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌరవులు తమలో తాము కొట్టుకుని నాశనమైతే, పాండవులు ఐకమత్యంతో ఎలా గెలిచారో మహాభారతాన్ని ఉదహరిస్తూ, ప్రజలంతా ఏకతాటిపై నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.