హైదరాబాద్: 28°C
వార్తలు

వృద్ధులకు కేంద్రం గుడ్‌న్యూస్

దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డుల్లో వృద్ధుల సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కేంద్రం కీలక అడుగు వేసింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమక్షంలో ఓ కీలక ఒప్పందం కుదిరింది. డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖల మధ్య ఈ MoUపై సంతకం చేశారు. దీంతో వృద్ధులకు మరింత లబ్ధి చేకూరనుంది.