TG: షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. బస్సు దిగుతున్న ప్రయాణికుడి జేబులో నుంచి రూ.15 వేల నగదు చోరీ చేశారు. గమనించిన ప్రయాణికులు ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు బస్టాండ్ల వద్ద బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తమ సెల్‌ఫోన్లు, పర్సులను, ముఖ్యంగా మహిళలు మెడలో ఆభరణాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
వార్తలు
ఆర్టీసీ బస్టాండ్‌లో జేబు దొంగల చేతివాటం


