హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఓటు శాతం పెరిగింది: సీతారాం నాయక్

ములుగు జిల్లాలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 24 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదరికం తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో బలవంతపు పన్నుల విధింపును సహించబోమన్నారు.