హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాసరచన పోటీల్లో సత్రిత ప్రతిభ.. జిల్లా స్థాయికి ఎంపిక

JGL: మేడిపల్లి మండలం కల్వకోట జడ్పీహెచ్ఎస్‌లో పదో తరగతి చదువుతున్న ముత్యాల సత్రిత నియోజకవర్గస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మునీందర్, ఆర్‌ఐ ఎం.నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించి జిల్లా స్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.