హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా: జైషా

ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి జైషా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా జైషా స్పందించారు. రెండోసారి ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ఐసీసీ బోర్డుకు, డైరెక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాల కోసం సభ్య దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం ద్వారా కొత్త ప్రేక్షకులకు ఆటను పరిచయం చేసే గొప్ప అవకాశం లభిస్తుందన్నారు.