హైదరాబాద్: 28°C
క్రీడలు

మోహిత్.. ఆనాటి ధోనీని గుర్తు చేశావు: గవాస్కర్

అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌లో భారత్‌ను గెలిపించిన మోహిత్‌పై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. మాజీ కెప్టెన్ ధోనీని గుర్తు చేశాడంటూ కొనియాడాడు. 'తీవ్రమైన ఒత్తిడి సమయంలోనూ మోహిత్.. ధోనీలా ప్రశాంతంగా ఉన్నాడు. మోహిత్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి.. చేతులు పైకి ఎత్తి విజయం సాధించామని చెప్పాడు. 2011లోనూ ధోనీ ఇలానే చేశాడు. మోహిత్ సంబరాలు కూడా అద్భుతమైన జ్ఞాపకంగా మిగులుతాయి' అని పేర్కొన్నాడు.