హైదరాబాద్: 28°C
క్రీడలు

మరోసారి ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవ ఎన్నిక

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా రెండోసారి జైషా ఏకగ్రీవంగా పునర్నియామకమయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జై షా పేరును ఐసీసీ డైరెక్టర్లు ప్రతిపాదించగా.. ఆయన నాయకత్వంపై బోర్డు మరోసారి విశ్వాసం ప్రకటించింది. ఆయన కొనసాగింపు ద్వారా సంస్థకు నాయకత్వంలో స్థిరత్వం లభిస్తుందని పేర్కొంది.